స్వీపర్ రామ్మోహనరావుకు సత్కారం

Mar 1,2024 00:12

ప్రజాశక్తి – భట్టిప్రోలు
భట్టిప్రోలు పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేసిన రామ్మోహనరావు ఉద్యోగ విరమణ వీడ్కోలు సభ గురువారం నిర్వహించారు. స్థానిక పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వీడ్కోలు సభలో రామ్మోహనరావు దంపతులను సర్పంచి దార కిరణ్మయి, కార్యదర్శి కోటా శ్రీనివాసరావు షాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన సభకు కార్యదర్శి అధ్యక్షత వహించగా సర్పంచ్ మాట్లాడుతూ రామ్మోహనరావు ఎన్నో ఏళ్లగా పంచాయతీలో కార్మికులుగా పనిచేసి గ్రామస్తులకు సేవలు చేశారని కొనియాడారు. రామ్మోహనరావు శేష జీవితం సుఖ సంతోషాలతో వెలగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ బూరెలు రాంప్రసాద్, పాలకవర్గ సభ్యులు కుక్కల భూషణరావు, అబ్దుల్లా, బట్టు మల్లికార్జునరావు పాల్గొన్నారు.

➡️