ఆరోగ్య కేంద్రంలో పొంచి ఉన్న ప్రమాదం

Dec 29,2023 23:28

ప్రజాశక్తి – సంతమాగులూరు
స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్టాఫ్ నర్సు గదిలో స్లాబ్‌పై పెచ్చులు ఊడి ఇనుప సువ్వలు వేలాడుతున్నాయి. దీంతో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని ఆరోగ్య సిబ్బంది, పేషెంట్లు ఆందోళన చెందుతున్నారు. ఈ గదిలో నిత్యం నర్సు విధులు నిర్వహిస్తూ ఉంటుంది. పేషెంట్లు ఈ గదిలోకి వచ్చి ఓపి, ఇంజక్షన్స్ తీసుకుంటుంటారు. ఈ ఆరోగ్య కేంద్రం శిథిలావస్థకు చేరడంతో ప్రక్కనే నూతనంగా మరో భవనం నిర్మిస్తున్నారు. నిర్మాణంలో ఉన్న హాస్పటల్ ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు. హాస్పిటల్‌కి వచ్చిన పేషెంట్లు నర్సు గదిలోకి వెళ్లాలంటే జంకుతున్నారు. ఏ క్షణంలోనైనా గది పైకప్పు కూలవచ్చని చూస్తేనే అర్ధం అవుతుంది. ప్రమాదం పొంచి ఉన్నప్పటికీ అధికారులు ఎవరూ పట్టించుకోవడంలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరగకముందే ప్రత్యామ్నయం చూడాలని ఆరోగ్య సిబ్బంది, రోగులు కోరుతున్నారు.

➡️