విద్యార్ధులకు పుస్తకాలు పంపిణీ

Dec 29,2023 00:31

ప్రజాశక్తి – అద్దంకి
ప్రకాశం జిల్లాలో గత ఏడేళ్లుగా ఎన్నో ఉన్నత పాఠశాల్లో గ్రంధాలయ పుస్తకాలను అందిస్తున్న ప్రకాశం జిల్లా గ్లోబుల్ ఎన్ఆర్ఐ ఫామ్ సంస్థ మండలంలోని ధర్మవరం ఉన్నత పాఠశాలకి రూ.40వేలు విలువ చేసే 500 పుస్తకాలను గురువారం అంద చేశారు. సభకు హెచ్‌ఎం వి శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. సభలో డాక్టర్‌ కొర్రపాటి సుధాకరరావు, సాహిత్య వేత్తలు గాడేపల్లి దివాకరదత్తు, అనిల్ కుమార్ సూరి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఒక లక్ష్యంతో చదువుకోవాలని అన్నారు. అందుకు వివిధ పుస్తకాలు చదవాలని అన్నారు. పుస్తకం చదివే అలవాటు మనిషిని ఉన్నత స్థానాల్లో నిలబెడుతుందని అన్నారు. కార్యక్రమంలో చందలూరి నారాయణరావు, వి సుబ్బారావు, వి కపర్ధి, భాష పాల్గొన్నారు.

➡️