భూమి టైటిలింగ్‌ చట్టం రద్దు చేయాలి : న్యాయవాదులకు ఎమ్మెల్యే అనగాని సత్య్రపసాద్‌ సంఘీబావం

Dec 29,2023 00:34

ప్రజాశక్తి – రేపల్లె
బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కేసన గోపాలరావు మాట్లాడుతూ ఏపీ టైటిలింగ్ యాక్ట్ 27/22 చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని కోరారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి మానుకోవాలని అన్నారు. ప్రజా, రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోకపోతే రానున్న రోజుల్లో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. గత నాలుగు రోజులుగా చేస్తున్న నిరాహార దీక్షలకు ఎంఎల్‌ఎ అనగాని సత్య ప్రసాద్, మాజీ ఎంఎల్‌ఎ ఎం వెంకటసుబ్బయ్య, జనసేన ఇన్‌ఛార్జి మత్తి భాస్కరరావు మద్దతు తెలిపారు. ప్రస్తుత వైసిపి ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ఆలంబిస్తుందని అన్నారు. ప్రజల ఆస్తులపై హక్కులను కోల్పోయే ప్రమాదం ఉందని అన్నారు. టిడిపి, జనసేన ఉమ్మడి ప్రభుత్వం రాగానే ఇటువంటి చట్టాలను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. దీక్షలకు అనగాని శ్రీనివాసమూర్తి, పి నాగాంజనేయులు, వివిఎస్ఆర్ ప్రసాద్, జమీర్ భాష, ప్రసాదు పాల్గొన్నారు.

➡️