వృద్దులకు దుస్తులు పంపిణీ

Mar 31,2024 23:58 ##parchuru

ప్రజాశక్తి – పర్చూరు
మండలంలోని దగ్గుబాడు వాస్తవ్యులు కాకి శాంసన్, సునంద కుమార్తె ఈదుమూడి జెడ్‌పి హైస్కూల్‌ టీచర్‌ స్వర్ణలత ఈస్టర్ పండుగ సందర్భంగా 25మంది వృద్ధులకు నూతన దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆశ్రమంలోని వృద్దులు, యాజమాన్యం ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఆమెతోపాటు రత్నం, శ్రీనివాసరెడ్డి, ఆశ్రమ నిర్వాహకులు భవనం శ్రీనివాసరెడ్డి, జయలక్ష్మి పాల్గొన్నారు.

➡️