విద్యార్థులకు పరీక్షా సామాగ్రి పంపిణీ

Mar 6,2024 01:02

ప్రజాశక్తి – పర్చూరు
మండలంలోని నాగులపాలెం గ్రామంలోని డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్ గురుకుల పాఠశాల (బాలికలు) నందు, యద్దనపూడి మండలం పోలూరు గ్రామంలోని పరుచూరి శేషాచార్య ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థినీ, విద్యార్థులకు రోటరీ ప్రతినిధులు నర్రా వెంకటేశ్వరరావు (వెంకట్), లక్ష్మీసుధ ఆర్ధిక సహాయంతో ఎగ్జాం ప్యాడ్స్, పరీక్ష సామాగ్రి 120మందికి క్లబ్ అధ్యక్షుడు నాగబైరు శ్రీనివాసరావు చేతులు మీదుగా అందజేశారు. దాత నర్రా వెంకటేశ్వరరావు విద్యార్థులు పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. క్లబ్ అధ్యక్షుడు విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ పి విశ్వరాణి మాట్లాడుతూ రోటరీ క్లబ్ సహకారం విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. దాతలకు, రోటరీ క్లబ్‌ ప్రతినిధులకు ధన్యవాదంలు తెలిపారు. కార్యక్రమంలో కార్యదర్శి పంబి సదానందరెడ్డి, సీనియర్ సభ్యులు పాబోలు ఉదయ భాస్కర్, కోడూరి సుబ్రహ్మణ్యచారి, తేల్ల రమేష్ చంద్ర, కోమటి ఆంజనేయులు, పాబోలు వెంకన్న పాల్గొన్నారు.

➡️