బాధితులకు సరుకులు పంపిణీ

Dec 7,2023 00:33

ప్రజాశక్తి – భట్టిప్రోలు
మండలంలోని ఐలవరంలో తుఫాన్ కారణంగా ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో బాధితులకు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ మెరుగు నాగార్జున, కలెక్టర్ రంజిత్ భాష చేతుల మీదగా నిత్యవసర సరుకులు, నగదు బుదవారం అందజేశారు. ఐలవరం గిరిజన వాసులు పూరిగుడిసెల్లో నివాసం ఉంటూ తుఫానుకు దెబ్బతినే ప్రమాదం ఉన్న దృష్ట్యా ప్రత్యేక అధికారి నీలం దేవరాజు సూచనల మేరకు 26కుటుంబాలను శిభిరానికి తరలించారు. ఒక్కొక్కరికి రూ.2500 చొప్పున నగదు, 20కిల్లో బియ్యం, నిత్యవసర సరుకులు అందించినట్లు సర్పంచ్ మాచర్ల కోటేశ్వరరావు తెలిపారు. మంత్రి నాగార్జున మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని అన్నారు. ఒకప్పుడు వ్యవసాయం దండగని టిడిపి నాయకులు అన్నారని, నేడు వ్యవసాయమే ముద్దనే రీతిలో జగన్మోహన్‌రెడ్డి వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ప్రతి ఏటా ఇన్ ఫుట్ సబ్సిడీ, భీమా కల్పిస్తున్నట్లు తెలిపారు. గతంలో ఎన్నడూ ఇన్పుట్ సబ్సిడీ అందించిన దాఖలాలు లేవని అన్నారు. ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటున్నప్పటికీ ప్రతిపక్షాలు మాత్రం మాట్లాడటానికి ఏమీ లేని ఈ విధంగా ఆరోపణ చేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో ఆర్డిఓ పేల షారోన్, తహశీల్దారు డి వెంకటేశ్వరరావు, ఎంపీడీఒ గుమ్మా చంద్రశేఖర్, ఎంపీపీ డివి లలిత కుమారి, జడ్పిటిసి ఉదయభాస్కరి, ఎంపీటీసీ మురుగుడు శ్రీనివాసరావు, ఉప సర్పంచ్ కర్ర జయశ్రీ, గోలి శ్రీనివాసరావు, హేమ సుందర్రావు, బాలాజీ, మల్లేశ్వరరావు పాల్గొన్నారు.
ఐలవరంలో త్రీఫేస్ విద్యుత్తు సరఫరా
గ్రామంలో త్రీఫేస్ విద్యుత్ సరఫరా అయ్యే విధంగా చర్యలు చేపట్టినట్లు సర్పంచ్ మాచర్ల కోటేశ్వరరావు తెలిపారు. రూ.80లక్షలతో చేపట్టనున్న పథకానికి శంకుస్థాపన చేయనున్నట్లు పేర్కొన్నారు. గ్రామంలో విద్యుత్‌ సమస్య పరిష్కారం అవుతుందని అన్నారు.

➡️