యుటిఎఫ్‌ దుప్పట్లు పంపిణీ

Dec 7,2023 00:37

ప్రజాశక్తి – నిజాంపట్నం
మిచౌంగ్ తుఫాన్ ఈదురు గాలులతో నిరాశ్రయులైన ఎస్టీ కుటుంబాలు చలికి గజ గజలాడుతూ ఉణుకుతున్నారు. కుటుంబ పోషణకు ఇబ్బంది పడుతున్నారు. 60ఎస్టి కుటుంబాలకు యుటిఎఫ్ ఆధ్వర్యంలో దుప్పట్లు తినుబండారాలు బుదవారం అందజేశారు. స్థానిక తహశీల్దారు నెహ్రు బాబు, ఎంపీడీఒ నర్రా నాగలక్ష్మి, ఎంఇఒ జి శేషుగోపాలం చేతుల మీదగా అందించారు. తహశీల్దారు నెహ్రూ బాబు మాట్లాడుతూ యుటిఎఫ్ తుఫాను బాధితులకు దుప్పట్లు పంపిణీ చేయడం సంతోషంగా ఉందని అన్నారు. యుటిఎఫ్ సేవా కార్యక్రమాలు గతంలో గమనించానని, ఇంకా దాతలెవరైనా ఉంటే ముందుకు వచ్చి తుఫాను బాధితులకు సాయం చేయాలని అన్నారు. తొలుత అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ సిహెచ్ బాపయ్య, మండల అధ్యక్షులు కె రాజేష్, ప్రధాన కార్యదర్శి సిహెచ్ గణేష్‌రావు, గౌరవాధ్యక్షులు వై శ్రీనివాసరావు, జిల్లా కౌన్సిలర్స్ డి హరిబాబు, ఎండి హుస్సేన్, గౌస్ పాల్గొన్నారు.

➡️