దాతల సహకారం వినియోగించుకోవాలి

Feb 8,2024 00:32

ప్రజాశక్తి – చీరాల
దాతల సహకారాన్ని విద్యార్థుల అందరూ సద్వినియోగం చేసుకోవాలని పేరాల ఎఆర్‌ఎం హైస్కూల్ హెచ్ఎం బేతాళ సాల్మన్ అన్నారు. పాఠశాల్లోని 10వ తరగతి విద్యార్థినీ, విద్యార్థులకు వూరా మస్తానరావు, శివరాజ కుమారి ట్రస్ట్ ఆధ్వర్యంలో పరీక్షా సామగ్రి బుధవారం అందజేశారు. ఈ సందర్బంగా ట్రస్టు ప్రతినిధులు మాట్లాడుతూ విద్యార్థులు అందరూ పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని అన్నారు. ఇప్పటి వరకు 40పాఠశాలల్లో 2500మందికి పరీక్షా సామగ్రి అందజేశామని తెలిపారు. కార్యక్రమంలో డీ ఆర్ డీఒ విశ్రాంత శాస్త వేత్త అందె మురళీ వరప్రసాద్, నారాయణ, రాజేంద్ర ప్రసాద్, భాను చంద్ర మూర్తి పాల్గొన్నారు.

➡️