ఐక్య క్రిస్మస్‌ వేడుకల్లో డాక్టర్‌ పాలేటి

Dec 10,2023 23:24

ప్రజాశక్తి – చీరాల
లోక రక్షకుడు ఏసుక్రీస్తు అని, ఆయన జన్మదినం సర్వ మానవాళికి పండుగ దినమని మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావు అన్నారు. స్థానిక ఆనందపేటలో కాగితాల ఆనందరాజు, నక్క ఆదం, సలగల వినోద్ నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకలలో ఆయన మాట్లాడారు. దైవ ప్రసంగీకులు పాస్టర్ రత్న శేఖర్ ప్రార్థన నిర్వహించారు. సెమీ క్రిస్మస్ వేడుకల్లో డాక్టర్ పాలేటి రామారావు చేతుల మీదుగా కేకు కట్ చేసి భక్తులకు పంచిపెట్టారు. కార్యక్రమంలో పాస్టర్ రత్నరాజు, ఎడ్ల ప్రసాద్, గర్నేపూడి వసంతరావు, ఎడ్ల సంపత్ పాల్గొన్నారు.

➡️