త్రాగు నీటి సమస్య రాకుండా చూడాలి

Mar 7,2024 22:36

ప్రజాశక్తి – యద్దనపూడి
రానున్న వేసవిలో గ్రామాల్లో తాగునీటి సమస్యలపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఎంపీడీఒ శివ సుబ్రహ్మణ్యం సూచించారు. స్థానిక ఎంపీడీఒ కార్యాలయంలో గురువారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఎంపీపీ పి రజిని అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎంపిడిఒ మాట్లాడుతూ పారిశుధ్యంపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని అన్నారు. గ్రామాల్లో సంక్షేమ పథకాలు అర్హత ఉన్న వారందరికీ అందజేయాలని అన్నారు. ఎంఈఓ గోపి మాట్లాడుతూ మండలంలో 255 మంది విద్యార్థులకు టేబుళ్ళు పంపిణీ చేశామని చెప్పారు. కార్యక్రమంలో తహశీల్దారు నాగరాజు, ఎస్ఐ నాగ శ్రీను, ఎపిఎం వెంకట్రావు, పంచాయతీ రాజ్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

➡️