ఎన్నికలు ప్రశాంతంగా జరుపుకోవాలి

Feb 17,2024 23:56

ప్రజాశక్తి – బాపట్ల
అంజుమాన్ ఏ ఇస్లామియా ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా కమిటీ సభ్యులు కృషి చేయాలని పట్టణ సీఐ శ్రీనివాసులు సూచించారు. అంజుమన్ కమిటీ ఎన్నికలు ఆదివారం జరగనున్నాయి. ఈ సందర్భంగా అంజుమన్ కమిటీ సభ్యులతో ఆయన శనివారం మాట్లాడారు. ఈనెల 18న మార్కెట్ షాది ఖానాలో జరిగే అంజుమాన్ ఏ ఇస్లామియా ఎన్నికల్లో 29మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఉదయం పోలింగ్, సాయంత్రం కౌంటింగ్ నేపథ్యంలో ముస్లిం సోదరులు వివాదాలకు పాల్పడకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలన్నారు. చిన్నపాటి వివాదం జరిగిన సహించేది లేదని హెచ్చరించారు. కేసులు నమోదు చేసి అరెస్టు చేస్తామని చెప్పారు. ఎననికల నిర్వహణకు తాము సహకరిస్తామని అన్నారు.

➡️