మరో మారు జగన్ ను ఆదరించండి

Nov 29,2023 23:31

ప్రజాశక్తి – రేపల్లె
ప్రభుత్వ సంక్షేమ పథకాలపై లబ్ధిదారులకు అందించిన నగదు వివరాలతో ఏర్పాటు చేసిన సంక్షేమ పథకాల బోర్డు బుధవారం ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్ కు జగనే ఎందుకు కావాలంటే అనే కార్యక్రమం మండలంలోని పెనుమూడి సచివాలయం పరిధిలో నిర్వహించారు. సర్పంచ్ దారం విజయ్, వైసిపి రూరల్ కన్వీనర్ గాదె వెంకయ్యబాబు వైసిపి జెండా ఆవిష్కరించారు. అనంతరం సర్పంచ్ దారం విజయ్ మాట్లాడుతూ అభివృద్ధి జరగాలన్న, సంక్షేమ పథకాలు అందరికీ అందాలన్నా రానున్న ఎన్నిల్లో జగన్మోహన్ రెడ్డిని, మోపిదేవి వెంకటరమణరావుని గెలిపించుకోవాలని అన్నారు. పెనుమూడి సచివాలయం పరిధిలో నాలుగున్నర సంవత్సరాలలో రూ.22కోట్లు అభివృద్ధి పనులు ప్రత్యక్షంగా, పరోక్షంగా జరిగాయని అన్నారు. ఇంటింటికి తిరిగి ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కరపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో మండల కో ఆప్షన్ మెంబర్ షేక్ ఫరీద్, ఎంపీపీ సుధాహాసనరావు, నియోజకవర్గ సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు మండల అంజయ్య, వైస్ ఎంపీపీ రావు నెహ్రూ, లక్ష్మీ ప్రభాకరరావు, ఈఓపిఆర్డి మల్లికార్జునరావు, పంచాయతీ కార్యదర్శి కె విజయవర్ధిని పాల్గొన్నారు.

➡️