విస్తృతంగా తనిఖీలు

May 23,2024 23:01 ##Bapatla #Chirala #Police

ప్రజాశక్తి – చీరాల
ప్రశాంత వాతావరణంలో ఓట్ల లెక్కింపు చేసేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని ఒకటో పట్టణ సిఐ శేషగిరిరావు అన్నారు. ఎస్పీ ఆదేశాల మేరకు ముందస్తు చర్యల్లో భాగంగా గురువారం పలు చోట్ల పోలీసు అదికారులు తనిఖీ చేశారు. అదే విధంగా పలు వాహనాలు తనిఖీ చేశారు. వాహనాలు ధ్రువీకరణ పత్రాలు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ 4న ఎన్నికల లెక్కింపు జరగనున్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగా భద్రత చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎవరైనా ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తులు, తరచూ ఘర్షణలు పడే వ్యక్తులు, పాత నేరస్తుల వివరాల కోసం తనిఖీ చేస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా పాత నేరస్తులు, అవాంఛనీయ ఘటనలకు పాల్పడే అవకాశం వున్న వారు, అనుమానితులు ఉంటే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. గ్రామాల్లో ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తులు అనుమానాస్పదంగా గాని, గుంపులుగా గాని సంచరిస్తుంటే 100, 112కు సమాచారం ఇవ్వాలని కోరారు.

➡️