బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వ విఫలం

Dec 10,2023 00:11

ప్రజాశక్తి – రేపల్లె
జగనన్నకాలనీలో వర్షంనీళ్ల మధ్యలో నివాసం ఉంటున్న పేదలకు సిఎం ప్రకటించిన విధంగా రూ.2500నగదు, 25కేజీల బియ్యం, కందిపప్పు, ఆయిల్, బంగాళదుంపలు పంపిణీ చేయాలనీ సీపీఎం పట్టణ కార్యదర్శి సిహెచ్ మణిలాల్ డిమాండ్ చేశారు. పట్టణంలో వందల సంఖ్యలో పేదలు జగనన్న కాలనీలో తుఫాను వల్ల నేటికీ వర్షంనీటిలో ఉంటున్నారని అన్నారు. అయినప్పటికీ అధికారులు, ప్రజాప్రతినిధులు నష్టపరిహారం అందించడంలో విఫలమయ్యారని అనారు. జగనన్న కాలనీలో రోడ్లు లేకపోవడంతో మోకాళ్ళ లోతు వర్షం నీళ్లలో నడుస్తున్నారని అన్నారు. కొన్ని ప్రాంతాల్లో వర్షం నీళ్లను మోటర్లుతోనైనా తోడే ప్రయత్నం చేయలేదని అన్నారు. దోమలు స్వైర విహారం చేస్తున్నాయని అన్నారు. తాగటానికి మంచినీళ్లు కూడా లేవని అన్నారు. ఇన్ని సమస్యల మధ్య ఉన్న పేదలను పట్టించుకోవడంలో, తుఫాను పరిహారం అందించడంలో ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ చూపించాలని కోరారు. సిఎం జగన్‌ జిల్లా పర్యటన సందర్భంగా పునరావస కేంద్రాలకు వచ్చిన వారికే కాకుండా వర్షం నీళ్ల మధ్యలో ఉన్న పేదలకు రూ.2500 చొప్పున ఇంటింటికి తిరిగి అందించాలని ప్రకటన చేశారని గుర్తు చేశారు. కానీ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు లేవని చెప్తున్నారు. సిఎం ప్రకటించిన పద్ధతుల్లో ఇప్పటికీ వర్షం నీటిలో నివాసం ఉంటున్న పేదలందరికీ ఆర్థికసహాయం అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు డి శ్రీనివాసరావు, ఆవీర్వాదం, కె వెంకట్రావు, స్థానిక మహిళలు కె నాంచారమ్మ, సుబ్బారావు, అనూష పాల్గొన్నారు.

➡️