నష్టపోయిన రైతులను ఆదుకోవాలి : టిడిపి ఇన్చార్జి ఎంఎం కొండయ్య

Dec 16,2023 01:13

ప్రజాశక్తి – వేటపాలెం
మిచాంగ్ తుఫాను కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని టిడిపి ఇన్చార్జి ఎంఎం కొండయ్య కోరారు. మండలంలోని పందిళ్లపల్లి, బచ్చులవారిపాలెం, అక్కాయపాలెం, కొత్తపేట గ్రామాల్లో నష్టానికి గురైన పంట పొలాలను పరిశీలించారు. రైతులను పరామర్శించారు. రైతులు తమను ఇప్పటివరకు పలకరించిన నాధుడు లేడని ఆయన ఎదుట గోడు వెళ్ళబోసుకున్నారు. తమ కష్టాన్ని ప్రభుత్వానికి విన్నవించి పరిహారం అందే విధంగా ప్రయత్నం చేయాలని కోరారు. చంద్రబాబు ఆదేశాల మేరకు తాము పంటల పరిశీలన చేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రభుత్వం ఆదుకోకపోతే టిడిపి అధికారంలో రాగానే జరిగిన నష్టాన్ని పూడ్చడానికి కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో బాపట్ల పార్లమెంట్ తెలుగు రైతు అధ్యక్షులు నేపాలి సుబ్బారావు, యర్రాకుల ప్రసాద్, అడక స్వాములు, నేతాని ఉమామహేశ్వరరావు, షేక్ యాసిన్, షేక్ సుభాని, నాసిక వీరభద్రయ్య, చీరాల పట్టణ అధ్యక్షుడు గజవల్లి శ్రీనివాసరావు, వేటపాలెం అధ్యక్షుడు బొగ్గుల పార్థసారథి, చంద్ర, నరాల తిరుపతరాయుడు, పలగొర్ల మస్తాన్‌రావు, కుంచాల రామాంజనేయులు, నర్రా తిరపతయ్య, కౌత్రపు జనార్దనరావు పాల్గొన్నారు.

➡️