వసతి గృహానికి ఆర్ధిక సహకారం

Mar 20,2024 23:58

ప్రజాశక్తి – బాపట్ల
స్వాతంత్యానికి పూర్వమే వ్యవసాయ విద్యకు బీజం వేసిన బాపట్ల వ్యవసాయ కళాశాల్లో వ్యవసాయ విద్యను అభ్యసించడం ఎంతో గర్వకారణమని పూర్వ విద్యార్థులు తమ అనుభవాలను పంచుకున్నారు. కళాశాల్లో 1967-71బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం బుధవారం నిర్వహించారు. ఆనాటి జ్ఞాపకాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా కళాశాల్లో నిర్మితం అవుతున్న పూర్వ విద్యార్థుల వసతి గృహానికి ఆలమ్ని అగ్రికల్చరల్ గ్రాడ్యుయేట్స్ ట్రస్ట్ ఫర్ కాలేజ్ డెవలప్ మెంట్ ఆధ్వర్యంలో రూ.10లక్షల 41వేల116 విరాళాన్ని చెక్కు రూపంలో కళాశాల అసోసియేట్ డీన్ వి శ్రీనివాసరావుకు అందజేశారు. పూర్వ విద్యార్థులు కళాశాల పట్ల తమ అభిమానాన్ని చాటుకున్నారు. అసోసియేట్ డీన్ శ్రీనివాసరావు మాట్లాడుతూ విశ్రాంతి గృహం భవన సముదాయం కింద భాగం ఫిబ్రవరి 11న ప్రారంభించినట్లు తెలిపారు. మొదటి అంతస్తులో 12 గదుల నిర్మాణం జూన్ నాటికి పూర్తి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో కళాశాల పూర్వ విద్యార్థులు ఎం భాస్కరరావు, కె భాస్కరరావు, ఎం రమాదేవి, సౌభాగ్యలక్ష్మి, సిహెచ్ శ్రీనివాసరావు, వై సాంబశివరావు పాల్గొన్నారు.

➡️