తొలి ఓటు రాష్ట్ర ప్రగతిని చాటాలి : మై ఫస్ట్‌ ఓట్‌ ఫర్‌ సీబీఎన్‌ కార్యక్రమంలో ఎంఎల్‌ఎ అనగాని సత్య్రపసాద్‌

Mar 9,2024 23:46

జాశక్తి – రేపల్లె
రాష్ట్రాభివృద్ధికి పాటుపడే నేతను గుర్తించి, ఆలోచించి తొలిసారి ఓటు హక్కు పొందిన యువత సార్వత్రిక ఎన్నికల్లో ఓట్లు వేయాలని ఎంఎల్‌ఎ అనగాని సత్యప్రసాద్ కోరారు. పట్టణంలోని శ్రీ గుత్తికొండ లక్ష్మీనారాయణ కళ్యాణ మండపంలో నూతన ఓటర్ల పరిచయ కార్యక్రమం శనివారం నిర్వహించారు. నగరం, నిజాంపట్నం, చెరుకుపల్లి, రేపల్లె టౌన్, రూరల్ నుండి నూతన ఓటర్లు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. తొలుత టిడిపి వ్యవస్థాపకులు ఎన్‌టిఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. యువత తొలిసారిగా వేసే ఓటు దేశ, రాష్ట్ర గతిని మార్చేదిగా ఉండాలని అన్నారు. దేశ, రాష్ట్ర గతిని మార్చగల నేత చంద్రబాబు మాత్రమేనని అన్నారు. ఎన్నో ఐటీ కంపెనీలు ప్రారంభించి యువతకు స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చంద్రబాబు కృషి చేస్తే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కంపెనీలను తరిమివేశారని అన్నారు. సైకో పాలనలో రాష్ట్రం 30ఏళ్లు అభివృద్ధిలో వెనక్కి వెళ్ళిందని అన్నారు. భావితరాల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని చెప్పారు. రాష్ట్రానికి రాజధాని లేదని అన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవని అన్నారు. అభివృద్ధి అంతకంటే లేదన్నారు. ప్రశ్నించే తత్వాన్ని ఉక్కు పాదంతో అణిచివేస్తూ అరాచక పాలన సాగిస్తున్నారని అన్నారు. యువత మేల్కొనాలని, ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని, అభివృద్ధి, రాబోవు తరాలకు మంచి జరగాలనే ఉద్దేశంతో టిడిపి కృషి చేస్తుందని తెలిపారు. టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం కూటమిగా ఏర్పడి సైకో పాలనపై యుద్ధం చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రాన్ని రూ.లక్షల కోట్ల అప్పులు ఊబిలోకి నెట్టారని అన్నారు. రానున్న తరాలపై కూడా అప్పులు పెనుబారంగా మారనున్నాయని వివరించారు. అమరావతి రాజధాని నిర్మాణం కోసం రూ.28వేల ఎకరాల భూమి సేకరించి అభివృద్ధి చేయాలని టిడిపి అధినేత చంద్రబాబు చూస్తే ప్రస్తుత సిఎం జగన్‌ అమరావతిని నాశనం చేసి రాజధాని లేని రాష్ట్రంగా తయారు చేశారని ఆరోపించారు. తాను జైలుకు వెళ్లాడు కాబట్టి అందరిని జైలుకు పంపించాలని అక్రమ కేసులు పెడుతూ చంద్రబాబును వేధింపులకు గురి చేశారని అన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం మనసుకు నచ్చిన వారికి ఓటేయాలని నూతన ఓటర్లకు సూచించారు. యువతకు, మహిళలకు అద్భుతమైన పథకాల ద్వారా చేయూతను అందించేందుకు టిడిపి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేశారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను వివరించారు. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని టిడిపి నినాదమని అన్నారు. అందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. పరిపాలన వికేంద్రీకరణ, మూడు రాజధానుల పేరుతో ప్రజలను మోసం చేస్తూన్న జగన్ మోహన్‌రెడ్డి రాష్ట్రాన్ని రాజధాని లేని రాష్ట్రంగా చేశారని ఆరోపించారు. అనంతరం నూతన ఓటర్లతో ముఖాముఖి నిర్వహించారు. టిడిపి, జనసైనికులు రాష్ట్రంలో కొనసాగుతున్న దుర్మార్గపు పాలనను అంతం చేసేందుకు సైనికులు వలె పనిచేసి టిడిపి విజయానికి కృషి చేయాలని అన్నారు. కార్యక్రమంలో ఎపిడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండయ్య చౌదరి, శివరామకృష్ణ, కళ్యాణ్, హైమ, నాగబాబు, సురేష్, నరేంద్ర పాల్గొన్నారు.

➡️