ఐదుగురు పేకాటరాయుళ్ల అరెస్ట్

Feb 24,2024 23:18

ప్రజాశక్తి – వేటపాలెం
మండలంలోని అక్కాయ్యపాలెం పంచాయతీ శివారులో పేకాట ఆడుతున్న ఐదుగురిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. పేకాట ఆడుతున్న వారి వద్ద నుండి రూ.42వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. జూదగాలను పోలీసు స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పర్చనున్నట్లు తెలిపారు. ఈ దాడిలో చీరాల రూరల్ సీఐ నిమ్మగడ్డ సత్యనారాయణతో పాటు వేటపాలెం ఎస్‌ఐ జి సురేష్ పాల్గొన్నారు.

➡️