రోడ్డు నిబంధనలు పాటించాలి

Feb 6,2024 23:31

ప్రజాశక్తి – వేటపాలెం
రోడ్డుపై వాహనాలు నడిపేటప్పుడు ట్రాఫిక్‌ నిబందనలు పాటించడంతోపాటు వేగ నియంత్రణలో ఉండాలని ఆర్‌టిఒ ఆర్‌ సురేష్‌, ఎంవిఐ బి రామకృష్ణారెడ్డి అన్నారు. మండలంలోని సెయింట్‌ ఆన్స్‌ ఇంజనీరింగ్‌ కళాశాల్లో రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఎన్‌ఎస్‌ఎస్‌ అధ్వర్యంలో విద్యార్థులకు అవగాహనా సదస్సు మంగళవారం నిర్వహించారు. ద్విచక్ర వాహన దారులు హెల్మెట్‌ ధరించాలని, ఫోర్ వీలర్ వాహన దారులు సీట్‌బెల్ట్‌ ధరించాలని అన్నారు. రోడ్డు భద్రత, ట్రాఫిక నియమాలు, రోడ్ సేఫ్ట్ నియామాలు వివరంగా తెలిపారు. విద్యార్థులు రోడ్డు భద్రతా నియమాలు సక్రమంగా పాటించాలని, సిగ్నల్‌ను పాటించాలని, మద్యంతాగి, సెల్ ఫోనులో మాట్లాడుతూ వాహనాలను నడపరాదని చెప్పారు. అతివేగంగా వాహనాలను నడపరాదని అన్నారు. నియమాలను పాటించకుండా వాహనాలను ఒవర్ టేక్ చేయరాదని చెప్పారు. పాదచారులు జీబ్రా క్రాసింగ్ లైన్ల మీదుగా మాత్రమే రోడ్డు దాటాలని తెలిపారు. పరిమితికి మించి ఆటోల్లో ప్రయాణించరాదని తెలిపారు. డాక్టర్‌ ఎ నరేంద్ర మాట్లాడుతూ ప్రమాదం జరిగిన మొదటి గంటలోగా క్షతగాత్రులను ఆసుపత్రిలో చేర్పించాలని అన్నారు. ప్రణాపాయం నుండి రక్షించవచ్చని అన్నారు. ఆ గంట సమయం గోల్డెన్ అవర్ అన్నారు. సదస్సులో కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణారావు, కరస్పాండెంట్‌ ఎస్‌ లక్ష్మణరావు, మోటారు వాహన సహాయ అధికారి బి కిషోర్‌బాబు, డాక్టర్‌ ఎ నరేంద్ర, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎం వేణుగోపాలరావు, కళాశాల అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ ఆర్‌వి రమణమూర్తి, ఎన్‌ఎస్‌ఎస్‌ కో ఆర్డినేటర్ డాక్టర్‌ డి జ్యోతి స్వరూప్ పాల్గొన్నారు.

➡️