మాజీ ఎంఎల్‌ఎ ముమ్మనేని పరామర్శ

Mar 14,2024 23:52

ప్రజాశక్తి – భట్టిప్రోలు
మండలంలోని ఐలవరంలో ఇటీవల మృతి చెందిన వారి కుటుంబాలను రేపల్లె మాజీ ఎంఎల్‌ఎ వెంకటసుబ్బయ్య గురువారం పరామర్శించారు. మూడు రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందిన కర్ర ప్రసాదరావు కుటుంబాన్ని పరామర్శించి కుటుంబానికి సానుభూతిని తెలిపారు. టిడిపి నాయకులు కొడాలి వెంకట సత్యనారాయణ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా ఆయన సంస్కరణ సభలో పాల్గొన్నారు. సత్యనారాయణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కుటుంబాన్ని పరామర్శించారు. మృతుల కుటుంబాలకు టిడిపి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆయన వెంట టిడిపి నాయకులు మాచర్ల నాగరాజు, దీపాల ప్రసాదు, వామనపల్లి కోటేశ్వరరావు, కూరపాటి రఘురామయ్య, జొన్నాదుల వెంకటేశ్వరరావు, అత్తలూరి బాలకృష్ణ పాల్గొన్నారు.

➡️