దగ్గుబాడులో ఉచిత వైద్య శిబిరం

Jan 1,2024 00:38

ప్రజాశక్తి – కారంచేడు
మండలంలోని దగ్గుబాడు గ్రామంలో ఉచిత వైద్య శిబిరం ఆదివారం నిర్వహించారు. కేశరాల క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్ గడ్డం ధర్మానందరావు, గడ్డం నారాయణరావు జ్ఞాపకార్థం చీరాల చర్చి కాంపౌండ్ వద్ద ఉన్న ప్రాణహిత మల్టీ స్పెషాలిటీ మరియు క్యాన్సర్ సెంటర్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. షుగర్, బిపి, ఈసిజి తదితర పరీక్షలు నిర్వహించి 250మందికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. డాక్టర్ గడ్డం పృథ్వి, డాక్టర్ శివాని రోగులకు పరీక్షలు చేశారు. కార్యక్రమంలో కో ఆప్షన్ సభ్యులు ముల్లా నూర్ అహ్మద్, గంట విజయ్ కుమార్ సహకారంతో ఏర్పాట్లు చేశారు.

➡️