రోటరీ ఆధ్వర్యంలో ఉచిత వైద్యశిభిరం

Dec 3,2023 23:30

ప్రజాశక్తి – రేపల్లె
తీర ప్రాంత ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించేందుకు డాక్టర్ సుఖవాసి బసవయ్య ఆర్థిక సాయం అందించటం అభినందనీయమని రోటరీ క్లబ్ అధ్యక్షులు ఎంఎం సక్సేనా అన్నారు. పట్టణంలోని వీరవల్ల కోటయ్య ఫంక్షన్ హాల్లో తీర ప్రాంత ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ఉచిత వైద్య శిభిరాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా సక్సేనా మాట్లాడుతూ డాక్టర్ బసవయ్య నాలుగు దశాబ్దాలుగా ప్రజలకు వైద్య సేవలు అందిచి ప్రజాభిమానాన్ని పొందారని అన్నారు. గత 20ఏళ్లుగా నల్లూరుపాలెం గ్రామంలో వివిధ సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. డాక్టర్ సుఖవాసి బసవయ్యను ఘనంగా సన్మానించారు. అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరంలో గ్రామీణులకు వైద్య పరీక్షలు చేశారు. ఉచితంగా మందులు అందజేశారు. 175మందికి వైద్య పరీక్షలు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో సుఖవాసి సతీష్ బాబు, డాక్టర్ వసంతం వీరరాఘవయ్య, వేపురి సాయేశ్వరరావు, పి శివశంకర ప్రసాద్, మల్లెల రామచంద్రరావు పాల్గొన్నారు.

➡️