జాతీయ పోటీలకు గౌతమి విద్యార్థి ఎంపిక

Dec 29,2023 00:16

ప్రజాశక్తి – ఇంకొల్లు రూరల్‌
మార్టూరు వివేకానంద నెక్ట్స్‌జెన్‌ స్కూల్ నందు ఈనెల 8, 9, 10తేదీల్లో జరిగిన 42వ జూనియర్ అండర్ 19రాష్ట్ర స్థాయి పోటీల్లో 18జిల్లాల విద్యార్ధులు పాల్గొన్నారు. బాపట్ల బాలుర జట్టు గుంటూరుపై 2-0తేడాతో గెలిచి మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ టీంలో ఇంకొల్లు శ్రీ గౌతమి జూనియర్ కాలేజీకి చెందిన విద్యార్థి అనిల్ కుమార్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జనవరిలో జరిగే జాతీయ షూటింగ్ బాల్ పోటీలకు అర్హత సాధించినట్టు షూటింగ్ బాల్ జిల్లా ప్రెసిడెంట్ డాక్టర్‌ ఐ బాబురావు, వర్కింగ్ ప్రెసిడెంట్ పవని భాను చంద్రమూర్తి తెలిపారు. కాలేజీలో గురువారం జరిగిన అభినందన సభలో కాలేజీ చైర్మన్ ఎం వెంకటేశ్వర్లు, డైరెక్టర్ కాట్రగడ్డ శ్రీనివాసరావు, ప్రిన్సిపాల్ ఎస్‌కె మోబిన్, జిల్లా కార్యదర్శి పిల్లి సురేంద్ర పాల్గొన్నారు.

➡️