కాంగ్రెస్ తోనే దేశానికీ మంచి రోజులు

Feb 2,2024 22:26

ప్రజాశక్తి – చీరాల
కాంగ్రెస్‌ అధికారానికి వస్తేనే దేశానికి మంచి రోజులని కాంగ్రెస్ నాయకులు నీలం శామ్యూల్ మోజెస్ అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా శుక్రవారం నిరసన ర్యాలీ చేశారు. స్థానిక గడియార స్థంభం సెంటర్లోని డాక్టర్‌ వైఎస్ఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావలసిన సమయం ఆసన్నమైందని అన్నారు. పీసీసీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిలరెడ్డి పగ్గాలు చేపట్టారని అన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినదిస్తూ ఉద్యమం చేస్తున్నారని తెలిపారు. ఆమె దీక్షకు అందరం సంఘీభావం తెలపాలని కోరారు. కులు, మతాల వారీగా ప్రజలను విడగొట్టాలనే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించుకోవాలని అన్నారు. కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువద్దామని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సయ్యద్‌ అలీమ్ బాబు, ఇతర నాయకులు పాల్గొన్నారు.

➡️