పిర్యాదులు తక్షణం పరిష్కరించాలి : స్పందనలో కలెక్టర్‌ పి రంజిత్‌బాష

Feb 8,2024 00:20

ప్రజాశక్తి – పర్చూరు
స్థానిక అద్దంకి నాంచారమ్మ కళ్యాణ మండపంలో జగనన్నకు చెబుదాం ప్రత్యేక స్పందన కార్యక్రమం కలెక్టర్ పి రంజిత్ భాష, జాయింట్ కలెక్టర్ చామకూర శ్రీధర్, ఆర్‌డిఓ గంధం రవీందర్ బుధవారం నిర్వహించారు. డ్రైనేజీలు, రోడ్లు, పట్టాదారు పాస్ పుస్తకాలు తదితర సమస్యలకు సంబంధించిన అర్జీలను ఆయన స్వయంగా స్వీకరించి వెంటనే పరిష్కరించాలని అధికారులకు అందించారు. మండలంలోని అగ్రహారం గ్రామానికి చెందిన రైతులు ఈనాం భూములకు పట్టాలు మంజూరు చేయాలని కలెక్టర్‌కు వినతిపత్రాన్ని అందించారు. జగనన్న పట్టాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎంతవరకు వచ్చిందో జిల్లా రిజిస్ట్రార్‌ను అడిగి తెలుసుకున్నారు. రిజిస్ట్రేషన్‌ వేగవంతం చేయాలని ఆదేశించారు. చెరువు కట్టపై ఉన్న ఆక్రమణలకు సంబంధించి కోర్టు ఉత్తర్వులు ఉన్నా అధికారులు స్పందించడం లేదని అన్నారు. వాటిని వెంటనే తొలగించాలని గ్రామస్థులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. జాతీయ రోడ్డు విస్తరణలో భాగంగా ఉప్పుటూరులో స్మశాన వాటిక పూర్తిగా పోయిందని, తమకు వేరే చోట స్మశాన వాటిక స్థలాన్ని కేటాయించాలని గ్రామస్థులు కోరారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్రీధర్, బాపట్ల ఆర్డిఓ జి రవీందర్, స్థానిక తహసీల్దార్ సి హెచ్ సుబ్బయ్య, సంధ్యశ్రీ, ఏడిఏ మోహనరావు, హౌసింగ్ మురళి, డిఎంహెచ్‌ఒ విజయలక్ష్మి, పిఆర్‌ డిఈ విభీషణ్, ప్రత్యేకాధికారి రామకృష్ణ పాల్గొన్నారు.

➡️