నేడు జివిఆర్ హాస్పిటల్ ప్రారంభం

Mar 7,2024 22:36

– అందరికీ అందుబాటులో ఆధునిక వైద్యం
– జీవిఆర్ హాస్పిటల్ ఎండి పల్లె సాధన గ్రేస్
ప్రజాశక్తి – చీరాల
దూర ప్రాంతాలకు వెళ్లకుండా అత్యాధునిక వైద్యాన్ని ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకువచ్చి నాణ్యమైన వైద్య సేవలు అందించడమే జివిఆర్ అల్ట్రా కేర్ మల్టీస్పెషలిటి హాస్పిటల్ లక్ష్యమని డాక్టర్ పల్లె ప్రదీప్ రతన్, హాస్పటల్ మేనేజింగ్ డైరెక్టర్ పల్లె సాధన గ్రేస్ దంపతులు తెలిపారు. మసీదు సెంటర్, చర్చి కాంపౌండ్ రోడ్డులో నూతనంగా జివిఆర్ అల్ట్రా కేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ను నేడు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. సీనియర్ వైద్యులు డాక్టర్ గోరంట్ల సుబ్బారావు, డాక్టర్ బండ్లమూడి పేరయ్య చౌదరి, డాక్టర్ బండ్లమూడి సరిత చౌదరి హాజరవుతారని తెలిపారు. గతంలో రవి పార్సెల్ పక్కన జివిఆర్ హాస్పిటల్ ప్రజలకు వైద్య సేవలు అందించిందని అన్నారు. నూతనంగా హాస్పటల్ ప్రారంభించి అత్యాధునిక పరికరాలతో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. జనరల్, ఎమర్జెన్సీ కేసులు, వెంటిలేటర్, డిఎక్సరే సదుపాయం, ల్యాబ్, మెడికల్ షాప్, అంబులెన్స్ వసతులతో సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. తమ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

➡️