కత్తి పద్మారావు జోలికొస్తే తీవ్ర పరిణామాలు

Feb 11,2024 22:21

ప్రజాశక్తి – చీరాల
కేంద్రంలోని బిజెపి అండతోనే ఆర్ఎస్ఎస్ మూకలు చట్టానికి వ్యతిరేకంగా చెల రేగుతూ దళిత ఉద్యమ నేత కత్తి పద్మారావుపై సోషల్ మీడియాలో పోస్టింగులో పెడుతున్నారని, వీటిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. కారంచేడు మృతవీరుల రుద్ధిరక్షేత్రం వద్ద విలేకర్ల సమావేశం నిర్వహించారు. కారంచేడు ఉద్యమ నేత డాక్టర్ కత్తి పద్మారావుపై సోషల్ మీడియాలో ఆర్ఎస్ఎస్ మూకలు చేస్తున్న దాడిని ఖండించారు. పద్మారావు దళితుల ఆశాజ్యోతని, ఆయన అంబేద్కర్‌ను దళితుల పల్లెలకి తీసుకొచ్చిన గొప్ప నాయకుడని అన్నారు. కారంచేడు, చుండూరు, లక్ష్మిపేటలో జరిగిన మారణ కాండలో బాధితుల పక్షాన నిలబడి ఎన్నో త్యాగాలు చేసిన గొప్ప నాయకుడని అన్నారు. ఆర్ఎస్ఎస్ మూకలు చట్ట వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని అన్నారు. పద్మారావుపై ఈగ వాలిన తీవ్ర పరిణామాలు జరుగుతాయని హెచ్చరించారు. కార్యక్రమంలో కారంచేడు బాదితులు దుడ్డు భాస్కరరావు, తేళ్ళ సుబ్బారావు, దుడ్డు సుందరరావు, వెంకటస్వామి, రవికుమార్, లక్ష్మినరసయ్య, సులోచన, సైమన్, లూకయ్య, దేవదానం, మార్క్, రాజకుమార్, శ్యామ్ సుందర్, శ్రీను, లక్ష్మయ్య పాల్గొన్నారు.

➡️