ఆకట్టుకున్న నాటికలు

Jan 13,2024 00:43

ప్రజాశక్తి – యద్దనపూడి
మండలంలోని అనంతవరం గ్రామంలో శుక్రవారం రాత్రి ఎన్‌టిఆర్‌ కళాపరిషత్ రెండు తెలుగు రాష్ట్రాల ద్వితీయ పరిషత్ నాటికల పోటీలు జరిగాయి. 2వ రోజు పోటీలను దర్శకులు మల్లాది శివన్నారాయణ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పరిషత్ నాటికలు వీక్షకులను ఆకట్టు కుంటున్నాయని అన్నారు. పోటీలకు గుంటూరుకు చెందిన సుమ పమిడిఘంటం, ఒంగోలుకు చెందిన పి పాండురంగారవు, విజయవాడకు చెందిన మల్లిపెద్ది సుమన్ మల్లిపెద్ది న్యాయ నిర్ణేతలుగా వ్యవహారించారు. పోటీల్లో కన్నీటి కధ, రైతే రాజు, జరుగుతున్న కధలను ప్రదర్శించారు. సూరవరపుపల్లి కోయ కోల్డ్ స్టోరేజి యాజమాన్యం రూ.20వేలు, ఎన్‌టిఆర్‌ కళాపరిషత్ రూ.40వేలు ప్రదర్శన పారితోషకం అందజేశారు. కార్యక్రమంలో అంబటి మురళీ కృష్ణ, పరిషత్ అధ్యక్షుడు గుదే పాండు రంగారావు, ఎం శ్రీను, ఆర్ శ్రీను పాల్గొన్నారు.

➡️