వైసిపి పాలనలో బీసీలకు అన్యాయం

Jan 13,2024 00:56

ప్రజాశక్తి – బాపట్ల
వైసిపి పాలనలో బీసీలకు తీరని అన్యాయం జరుగుతోందని టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి తాత జయప్రకాష్ నారాయణ అన్నారు. స్థానిక టిడిపి కార్యాలయంలో టిడిపి బిసి నాయకులతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. వైసీపీలో బీసీ నేతలకు, ప్రజలకు గౌరవం లేదని అన్నారు. పెద్దిరెడ్డి, విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి, సజ్జల ముందు బానిసలుగా ఉన్నారని ఆరోపించారు. బీసీ యువతకు సరైన విద్యా ప్రోత్సాహకాలు అందడం లేదన్నారు. అరాచక పాలనను సాగనంపాలని అన్నారు. రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలన్నీ చిన్నా భిన్నం చేస్తున్నారని ఆరోపించారు. సమావేశంలో తోట నారాయణ, గొలపల శ్రీనివాసరావు, పరిశా రమేష్ గౌడ్, వడ్లమూడి వెంకటేశ్వరులు, ఉప్పాల కృష్ణ గౌడ్, గుడిపల్లి సాంబశివరావు, కొల్లూరి వెంకటరావు, మురళి, కర్రీ మునేశ్వరరావు, వక్కముంతల హనుమాజీ, కర్పూరపు మురళి, మరీదు వెంకటేశ్వర్లు, సురగాని శేఖర్ పాల్గొన్నారు.

➡️