రక్త దానం కరపత్రాల ఆవిష్కరణ

Mar 14,2024 23:56

ప్రజాశక్తి – కర్లపాలెం
రక్త దానం చేయడం ప్రాణదానంతో సమానమని తహశీల్దారు నిర్మలానంద బాబా అన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు 123వ జయంతి సందర్భంగా స్థానిక శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో గురువారం ఏర్పాటు చేసిన మెగా రక్త దాన శిబిరం ఆయన ప్రారంభించారు. పొట్టి శ్రీరాములు పరిరక్షణ కమిటీ జిల్లా వైస్ చైర్మన్ వెంకట సుబ్బారావు వైద్యశిభిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కరపత్రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకటసుబ్బారావు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర కీర్తికి నిలువెత్తు నిదర్శనం పొట్టి శ్రీరాములు అని అన్నారు. రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో రక్తదాన శిభిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రక్తదాతలకు సమితి వ్యవస్థాపక అధ్యక్షులు సత్కరించారు. కార్యక్రమంలో పొట్టి శ్రీరాములు సేవా సమితి అధ్యక్షులు రాంబాబు, కార్యదర్శి కోడూరి చంద్రశేఖరరావు, రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఈ పోలీసురావు పాల్గొన్నారు.

➡️