టీడీపీలో చేరిక

Mar 11,2024 00:00

ప్రజాశక్తి – భట్టిప్రోలు
టిడిపి రాష్ట్ర కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబా ఆధ్వర్యంలో 150మంది వైసీపీకి చెందిన కార్యకర్తలు టిడిపిలో చేరారు. మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, రేపల్లె మాజీ ఎంఎల్‌ఎ ముమ్మనేని వెంకటసుబ్బయ్య టిడిపి కండువా కప్పి టిడిపిలోకి ఆహ్వానించారు. స్థానిక కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో జరిగిన కార్యక్రమాన్ని ఉద్దశించి ఆనందబాబు మాట్లాడుతూ తాను ఎన్నికల్లో టిడిపి, జనసేన గెలుపే లక్ష్యంగా కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. వైసిపి అరాచక పాలన నుండి రాష్ట్ర ప్రజలకు విముక్తి కలిగించేందుకు ప్రజలు టిడిపివైపు చూస్తున్నట్లు తెలిపారు. పార్టీలో చేరే ప్రతి ఒక్కరికి సముచిత స్థానం ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు వై కరుణ శ్రీనివాసరావు, యడ్ల జయసిలరావు, కుక్కల వెంకటేశ్వరరావు, బట్టు మల్లికార్జునరావు, కనపర్తి సుందర్రావు, గొట్టుముక్కల లెనిన్, జనసేన ఇన్‌ఛార్జి ఊస రజేష్ పాల్గొన్నారు.

➡️