పెదపులివర్రు నుండి వైసీపీలో చేరిక

Mar 6,2024 00:57

ప్రజాశక్తి – భట్టిప్రోలు
మండలంలోని పెదపులివర్రు పంచాయతీలో గల సుమారు ఏడు గ్రామాల నుండి టిడిపికి చెందిన 20 కుటుంబాలు వైసీపీలో ఎంపీపీ లలిత కుమారి ఆధ్వర్యంలో చేరారు. అమర్తలూరు మండలం కూచిపూడిలో గల వైసీపీ ఇన్చార్జి వరికూటి అశోక్ బాబు నివాస గృహం వద్ద ఆయన సమక్షంలో వైసిపి కండువాలు కప్పుకున్నారు. వీరిని అశోక్ బాబు సాదరంగా వైసిపిలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీలో చేరిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం లభిస్తుందని అన్నారు. రానున్న ఎన్నికల్లో సిఎంగా జగన్మోహన్‌రెడ్డిని మరోసారి గెలిపించుకునేందుకు కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. వేమూరు నుండి తనను గెలిపించాలని కోరారు. కుల, మతాలకు అతీతంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వైసీపీలో చేరుతున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో వైసిపి నాయకులు నాగమల్లేశ్వరరావు, దున్న మధు, జోషికాంత్, మాజీ ఎంపీటీసీ జంపని ముని లక్ష్మి పాల్గొన్నారు.

➡️