తురిమెళ్ళ నుండి వైసీపీలో చేరిక

Mar 4,2024 00:13

ప్రజాశక్తి – వేమూరు
అమర్తలూరు మండలం తుడిమెళ్ళ గ్రామం నుండి టిడిపికి చెందిన 15 కుటుంబాలు వైసిపి ఇన్‌ఛార్జి వరికూటి అశోక్ బాబు సమక్షంలో ఆదివారం వైసీపీలో చేరారు. సిఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కుల, మతలకు అతీతంగా అమలు చేస్తున్న నవరత్నాల పథకాలకు ఆకర్షితులై వైసీపీలో పని చేయాలని నిశ్చయించుకున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా అశోక్ బాబు మాట్లాడుతూ వైసిపిలో చేరిన ప్రతి ఒక్కరికి తగిన గుర్తింపు లభిస్తుందని అన్నారు. రాను ఎన్నికల్లో వైసీపీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కోరారు. కార్యక్రమంలో వైసిపి కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

➡️