కబాడి, షటిల్ బ్యాట్ మెంటిన్ జట్ల ప్రతిభ

Dec 21,2023 02:24

ప్రజాశక్తి – వేటపాలెం
స్థానిక సెయింట్‌ ఆన్స్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలోని పాలిటెక్నిక్ విద్యార్ధుల కబాడి, షటిల్‌ బాట్మెంటిన్ జట్లు జిల్లా స్థాయి పాటీల్లో విన్నర్స్‌గా గెలుపొంది రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు కళాశాల సెక్రటరి వనమా రామకృష్ణారావు, కరస్పాండెంట్ ఎస్‌ లక్ష్మణరావు తెలిపారు. కందుకూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల్లో ఇటీవల ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్ నిర్వహించారు. ప్రకాశం జిల్లా స్థాయి గేమ్స్, స్పోర్ట్స్ కబాడి పోటీల్లో 8జట్లుతో పోటీపడి తమ విద్యార్ధులు విన్నర్స్‌గా నిలిచినట్లు ప్రిన్సిపాల్‌ ఎం వేణుగోపాలరావు తెలిపారు. కబాడి జట్టులో జె రాఘవేంద్ర, పి ఖాజా మొహిద్దీన్, ఎన్‌ మధుసాయి, ఎం గణేష్, ఎస్‌ జాన్‌రాజు, కె సాయికృష్ణరాజు, ఎన్‌ శ్రీకరప్రసాద్‌, జి వెంకటశివతేజ, పి శ్రావణ్ కుమార్, ఎన్‌ వెంకటగౌతం ఎన్నట్లు పిడి అన్నం శ్రీనివాసరావు తెలిపారు. షటిల్ బాట్మెంటిన్ పోటీల్లో 9జట్లుతో పోటీపడి తమ జట్టు సింగిల్స్, డబల్స్ ఫైనల్స్‌లో విన్నర్స్‌గా గెలుపొందినట్లు తెలిపారు. షటిల్ బాట్మెంటిన్ జట్సు డబల్స్ లో కె రిషికుమార్, ఎం సూర్యకిరణచ సింగిల్స్ జట్టులో కె రిషికుమార్‌ పాల్గొన్నట్లు తెలిపారు. 100మీటర్ల పరుగు పందెంలో పి ఖాజా మొహిద్దీన్ రన్నర్‌గా గెలుపొందారని తెలిపారు. విన్నర్స్‌గా నిలిచిన జట్లు 2024 జనవరి 4, 5, 6తేదీల్లో అనంతపురంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని పాలిటెక్నిక్‌ కళాశాల డెప్యూటి డైరక్టర్ కె విజయ భాస్కరరెడ్డి తెలిపారు. అభినందన సభలో అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ ఆర్‌వి రమణ మూర్తి, హెచ్‌ఒడిలు పాల్గొన్నారు.

➡️