కందిపప్పు త్వరగా పంపిణీ చేయాలి

Jan 15,2024 00:22

ప్రజాశక్తి – చెరుకుపల్లి
మండలంలో కందిపప్పు పంపిణీ సక్రమంగా, వేగవంతంగా పంపిణీ చేయాలని డిఎస్‌ఒ విలియమ్స్ ఆదేశించారు. సంక్రాంతి పండుగకు కందిపప్పు ఆలస్యంగా రావడంతో బియ్యం పంపిణీ పూర్తయినప్పటికీ కందిపప్పు సక్రమంగా పంపిణీ జరగలేదని అన్నారు. రెండు రోజుల క్రితం మండలానికి కందిపప్పు సరఫరా చేయగా పంపిణీ వేగవంతంగా కార్డుదారులకు అందజేయాలని ఎండియు ఆపరేటర్లను ఆదేశించారు. మండలంలోని గుల్లపల్లి, పొన్నపల్లి, కావూరు గ్రామాల పరిధిలోని ఎండియు వాహనాలను, రేషన్ షాపులను ఆదివారం పరిశీలించారు. కందిపప్పు అందరికీ అందేలా చూడాలని ఆపరేటర్లు, రేషన్ డీలర్లును కోరారు. కార్యక్రమంలో సిఎస్‌డిటి ఓంకార్ పాల్గొన్నారు.

➡️