జగనన్నను గెలిపించుకుందాం

Nov 28,2023 23:45

ప్రజాశక్తి – చీరాల
రాష్ట్ర అభివృద్ధి జరగాలన్న, సంక్షేమ పథకాలు అందరికీ అందాలన్నా రాబోయే ఎన్నికలలో జగన్మోహన్‌రెడ్డిని, వెంకటేష్ బాబును గెలిపించుకోవాలని మున్సిపల్‌ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు అన్నారు. ఎంఎల్‌ఎ కరణం బలరామకృష్ణమూర్తి, వైసిపి ఇంచార్జీ కరణం వెంకటేష్ ఆదేశాల మేరకు పట్టణంలోని రామనగర్ సచివాలయం పరిధిలో 1వ వార్డ్ ఇంచార్జ్ మల్లి రామకృష్ణ అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్‌కు జగనన్నే ఎందుకు కావాలంటే కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. కార్యక్రమంలో వైసిపి పట్టణ అధ్యక్షులు కోండ్రు బాబ్జీ, డిఈ ఏసయ్య, పోలీస్ హౌసింగ్ బోర్డు డైరెక్టర్ మల్లి వైష్ణవి, వైస్ చైర్మన్ బొనిగల జైసన్ బాబు, కౌన్సిలర్ మొగిలి దీపిక, వైసిపి జిల్లా కార్యదర్శి శిఖా సురేష్, ఎనల్లబోతుల రాజ్ కుమార్, కోలా శివకృష్ణ, మల్లీ హరీష్, కౌన్సిలర్ మల్లెల లలితరాజశేఖర్, కో ఆప్షన్ షేక్ కబీర్, షేక్ సుభాని, కళ్యాణం విజయప్రకాష్, షేక్ రియాజ్, దుడ్డు సైమన్, మామిడాల సుబ్బారావు, తేళ్ళ రాంబాబు పాల్గొన్నారు.

➡️