టిడిపిని గెలిపిద్దాం నరేంద్ర వర్మ

Feb 25,2024 23:03

ప్రజాశక్తి – బాపట్ల
టిడిపిని గెలిపిచాలని టిడిపి అభ్యర్ధి వేగేశన నరేంద్ర వర్మ కోరారు. టిడిపి, జనసేన సంయుక్తంగా ఇంటింటికి టిడిపి, మీ మాట – నా బాట, జనసేన, టిడిపి జనబాట కార్యక్రమాన్ని మండలంలోని హనుమాన్ నగర్, పోతురాజు కొత్తపాలెం గ్రామాల్లో జనసేన నాయకులతో కలిసి ఆయన పర్యటించారు. టిడిపి, జనసేన ఉమ్మడి మినీ మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. టిడిపి అమలు చేయబోయే పధకాలను వివరిస్తూ మహిళలకు పుస్తకం, చీర, చేతి సంచి పంపిణీ చేశారు. కార్యక్రమంలో కావూరి శ్రీనివాసరెడ్డి, తాతా జయప్రకాష్ నారాయణ, పల్లం సరోజినీ, పల్లం జీవన్, దయా బాబు, ఫరీద్, మస్తాన్ పాల్గొన్నారు.

➡️