వెలుగు విఓఏలు సమస్యలు పరిష్కరించాలి

Jan 30,2024 00:15

ప్రజాశక్తి – రేపల్లె
వెలుగు విఓఏల కాల పరిమితి సర్య్కలర్ రద్దు చేయాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని ఈనెల 30, 31తేదీల్లో విజయవాడలో 36గంటల మహాధర్నాకి విఓఏలు తరలిరావాలని సీఐటీయు జిల్లా అధ్యక్షులు సీహెచ్ మణిలాల్, ఐకెపి విఓఏ అధ్యక్షులు ఎల్ శేషుకుమారి కోరారు. రాష్ట్రవ్యాప్తంగా విజయవాడలో జరిగే ఆందోళనలో బాగంగా సమస్యలు పరిష్కరించాలని మండల సమాఖ్య అధ్యక్షరాలికి సోమవారం వినతి పత్రం అందచేశారు. వెలుగు విఓఏల సమస్యలు మిద ప్రభుత్వానికీ అనేక సార్లు వినతి పత్రాలు ఇచ్చినా ప్రభుత్వం స్పందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న నేపద్యంలో మహాధర్నా చెప్పట్టినట్లు తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైన స్పందించి వెంటనే 3సంరాలు కాలపరిమితి సర్య్కలర్ రద్దుచేయాలని కోరారు. ఉద్యోగ భద్రత లేకుండా భయపెడుతూ మూడేళ్లు పనిచేసి తర్వాత ఇళ్లకి వెళ్ళమనటం ఏమిటని ప్రశ్నించారు. హెచ్ఆర్ ఫాలసి అమలు చేయాలని, రూ.10లక్షల గ్రూప్ ఇన్సరెన్స్, విఓలు మెర్జింగ్ ఆపాలని కోరారు. డ్వాక్రా సభ్యులతో బలవంతపు కొనుగోళ్లు ఆపాలి, 15గ్రూపులు కంటే తక్కువ ఉన్నా విఓఏలకు వేతనం అమలు చేయాలనే సమస్యల పరిష్కారం కోసం విజయవాడలో ధర్నాకి తరిలి రావాలని కోరారు. కార్యక్రమంలో మండలంంలో ఐకేపీ విఓఎలు ఉమాదేవి, తిరుపతమ్మ, స్వాతి పాల్గొన్నారు.

➡️