సర్కార్ ఎక్స్ప్రెస్‌లో మద్యం స్వాధీనం

Feb 6,2024 23:17

ప్రజాశక్తి – చీరాల
రైలులో అక్రమ మద్యం తరలిస్తున్న ఓ వ్యక్తిని రైల్వే పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. జిఅర్‌పి ఎస్ఐ కొండయ్య రైల్వే ఉన్నతాధికారుల ఆదేశాలతో తన సిబ్బందితో కలిసి రైళ్లలో తనిఖీలు చేపట్టిన క్రమంలో మంగళవారం తెల్లవారు జామున సర్కార్ ఎక్స్ప్రెస్‌లో ఓ వ్యక్తి వద్ద 42మద్యం సీసాలు స్వాదీనం చేసుకున్నారు. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లువ ఎస్సై కొండయ్య తెలిపారు. నిరంతరం తనిఖీలు కొనసాగిస్తామని తెలిపారు. డబ్బు, మద్యం ఎవరు తెచ్చినా కేసులు తప్పవని చెప్పారు.

➡️