ఎంఎస్‌ రాజు టిడిపి ఎంపీ అభ్యర్థిగా ప్రచారం

Mar 18,2024 23:44

ప్రజాశక్తి – చీరాల
బాపట్ల పార్లమెంటు టిడిపి అభ్యర్థిగా అనంతపురం జిల్లాకు చెందిన ఎంఎస్ రాజుకు ఖరారైనట్లు టిడిపి వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. అందుకు సంబంధించి టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు బాపట్ల పార్లమెంటు పరిధిలోని వివిధ నియోజకవర్గాల ప్రజలకు ఫోన్ సర్వే నిర్వహించారు. వైసిపి నేతలు టిడిపిపై చేస్తున్న విమర్శలను తిప్పి కొడుతూ దళితుల సమస్యలపై పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన అనుభవం రాజుకి ఉందని అంటున్నారు. ఇటీవల ప్రచారంలోకి వచ్చిన మాజీ ఐఆర్ఎస్ అధికారి దగ్గుముళ్ల ప్రసాదరావుకు చిత్తూరు జిల్లాలో అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బాపట్ల పార్లమెంటు అభ్యర్థిగా ఎంఎస్ రాజు పేరు తెరపైకి వచ్చింది. దాదాపు టికెట్ ఆయనకే ఖరారైనట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే అధికారికంగా మరో రెండు రోజుల్లో ప్రకటించే జాబితాలో ఎవరి పేరు ఉంటుందో వేచి చూడాల్సి ఉంది.

➡️