నరేంద్రవర్మ పుట్టినరోజు వేడుకలు

May 23,2024 22:54 ##tdp #Bapatla #narendravarma

ప్రజాశక్తి – బాపట్ల
టిడిపి ఉమ్మడి ఎంఎల్‌ఎ అభ్యర్థి వేగేశన నరేంద్ర వర్మ పుట్టినరోజు వేడుకలను స్థానిక రైలుపేటలో టిడిపి నాయకులు గురువారం ఘనంగా నిర్వహించారు. నరేంద్ర వర్మ నిలువెత్తు చిత్రపటాన్ని ఏర్పాటు చేసి భారీ కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షులు గొలపల శ్రీనివాసరావు, సీనియర్ నాయకులు కర్పూర రామారావు, రైలుపేట నాయకులు అద్దంకి సోమశేఖరరావు, సీతాలు పాల్గొన్నారు.

➡️