ఎన్ఎస్ఎస్ అవగాహన ర్యాలి

Mar 11,2024 00:04

ప్రజాశక్తి – చెరుకుపల్లి
జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) సేవల్లో భాగంగా ఆచార్య ఎన్జీరంగా విశ్వవిద్యాలయం సౌజన్యంతో బాపట్ల డాక్టర్ ఎన్టీఆర్ వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో మండలంలోని కావూరు ఆరుంబాక పంచాయతీ ఏమినేని వారిపాలెం గ్రామాల్లో ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రత్యేక కార్యక్రమాలు ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లోని రోడ్లను, పరిసరాలను పరిశుభ్రపర్చారు. వివిధ రకాలైన కలుపు మొక్కలు, వయ్యారి భామ మొక్కలను తీసివేసి శుభ్రపర్చారు. అనంతరం కావూరు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో చెత్త మొక్కలు తీసి పరిశుభ్రం చేశారు. పచ్చదనం పరిశుభ్రత, వాటి ప్రాధాన్యత గురించి గ్రామస్తులకు వివరించారు. సందర్భంగా గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ అధికారులు వీరప్రసాద్, కృపావతి, కావూరు సర్పంచ్ చెల్లి జ్యోతి రవికుమార్, ఎన్ఎస్ఎస్ అధికారులు పాల్గొన్నారు.

➡️