పవర్ బిఐపై ఒక రోజు వర్క్ షాపు

Feb 24,2024 23:16

ప్రజాశక్తి – వేటపాలెం
స్థానిక సెయింట్ ఆన్స్ ఇంజినీరింగ్ కాలేజీలో పవర్ బిఐ అనే అంశంపై ఒక రోజు వర్క్ షాపును నిర్వహించినట్లు కళాశాల సెక్రటరి వనమా రామకృష్ణారావు తెలిపారు. డేటా సైన్స్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో బిటెక్ 2వ సంవత్సరం విద్యార్దులకు పవర్ బిఐపై వర్క్‌షాపులో విద్యార్ధులకు అవగాహన కల్పించినట్లు ప్రిన్సిపాల్‌ మొయిద వేణుగోపాలరావు తెలిపారు. హైదరాబాద్‌ సైంట్‌ ప్రవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ సైంటిస్ట్‌ పివి యస్శ్రావణి వివరించారని డేటా సైన్స్ హెచ్‌ఒడి కె సుబ్బారావు తెలిపారు. డేటా విశ్లేషణ ఎలా చేయాలో తెలిపారు. దానిలో వివిద పద్ధతులు, డేటా ఆధారంగా డాష్ బోర్డులు ఎలా రూపొందించవచ్చో తెలిపారు. ఈ విభాగంలో నైపుణ్యత సాధించిన వారికి అధిక వేతనంతో కూడిన అనేక ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నట్లు తెలిపారు.

➡️