మహిళా వ్యాయామశాల ప్రారంభం

Mar 8,2024 23:56

ప్రజాశక్తి – చీరాల
స్థానిక ఎన్‌ఆర్‌ అండ్‌పిఎం ఉన్నత ఆవరణంలో రూ.20లక్షలతో నూతనంగా నిర్మించిన మహిళా వ్యాయామ శాల భవనంను ఎంఎల్‌ఎ కరణం బలరామ కృష్ణ మూర్తి, వైసిపి ఇంచార్జీ కరణం వెంకటేష్ ఆయన సతీమణి కరణం గీత శుక్రవారం ప్రారంభించారు. మహిళా దినోత్సవం సందర్భంగా పట్టణంలోని మెప్మా ఆర్‌పిలను అభినందించారు. కార్యక్రమంలో చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ బొనిగల జైసన్‌బాబు, వైసిపి పట్టణ అధ్యక్షులు కొండ్రు బాబ్జి, అర్భన్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్ గవిని శ్రీనివాసరావు, పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ మల్లి వైష్ణవి, మునిసిపల్ డిఇ ఐసయ్య, ఎఇ కట్టా రవి, వైసిపి మహిళ విభాగం రాష్ట్ర జాయింట్ సెక్రటరీ మల్లెల లలితరాజశేఖర్, కౌన్సిలర్‌ గోలి స్వాతి, చుక్కా నాగలక్ష్మీ, కో ఆప్షన్ సభ్యులు షేక్ ఫాతిమా, కోడూరి నాగజ్యోతి, సుకీర్తన, సిఎంఎం సుబ్రమణ్యం, సిఒలు పాల్గొన్నారు.పాల్గొన్నారు.
చీరాల : ఘంటసాల చైతన్య ఆధ్వర్యంలో స్థానిక విజిల్ పేటలోని కెఎంపిఏ పాఠశాలలో మహిళా దినోత్సవం శుక్రవారం నిర్వహించారు. హెచ్‌ఎం కెజె సుశీల అధ్యక్షత వహించారు. ఘంటసాల చైతన్య వేదిక మహిళా కార్యదర్శి ఎ కళ్యాణి, కోట వెంకటేశ్వరరెడ్డి, కె సాంబశివరావు, ఎ ఝాన్సీ రాణి, ఎస్ శీలమ్మ, ఎస్‌కె నూర్జహాన్, పి మధురవాణి, కె యశోద, కె ప్రసన్న, ఎ వినోద కుమారి పాల్గొన్నారు.

➡️