Suicide: కోటాలో జెఇఇ విద్యార్థి ఆత్మహత్య

Jun 16,2024 22:20 #kota, #rajastan, #student deaths, #suside

కోటా : రాజస్థాన్‌లోని కోటా నగరంలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్‌లోని మోతీహారీకి చెందిన ఆయుష్‌ జైస్వాల్‌ (17) రెండేళ్లుగా మహావీర్‌ నగర్‌ ప్రాంతంలో నివాసముంటూ జెఇఇకి ప్రిపేర్‌ అవుతున్నాడు. శనివారం అర్ధరాత్రి తన గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం ఉదయం జైస్వాల్‌ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన అతని స్నేహితులు తలుపులు పగులగొట్టగా ఉరి వేసుకుని కనిపించాడు. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని..న్యూ మెడికల్‌ ఆస్పత్రికి తరలించారు. దీంతో ఈ ఏడాది ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య 11కు చేరుకుంది.

➡️