పే స్కేల్ అమలు చేయాలి

Dec 29,2023 00:09

ప్రజాశక్తి – బాపట్ల
గ్రామ రెవెన్యూ సహాయకులకు తెలంగాణ తరహాలో పే స్కేల్ అమలు చేయాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయం వద్ద గురువారం ధర్నా చేశారు. ధర్నానుద్దేశించి సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కె ధనలక్ష్మి మాట్లాడుతూ రెవెన్యూ వ్యవస్థలో గ్రామ సేవకుల పాత్ర అత్యంత కీలకమైందని అన్నారు. గ్రామ సేవకులకు ఎన్నికల ముందు ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో వీఆర్ఏలకు అమలవుతున్న జీతభత్యాల పద్ధతిని మన రాష్ట్రంలో అమలు చేయాలని కోరారు. నామిని వీఆర్ఏలను రెగ్యులర్ చేయాలన్నారు. డిఏ హామీని నిలబెట్టుకోవాలన్నారు. పాత బస్టాండ్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. డిమాండ్స్ తో కూడిన వినతి పత్రాన్ని జాయింట్ కలెక్టర్ చామకూరి శ్రీధర్‌కు అందజేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ మజుందార్, వీఆర్ఏల సంఘం జిల్లా నాయకులు రత్నరాజు, కరీముల్లా, మహబూబ్ బి పాల్గొన్నారు.

➡️