‘వరాల గోరుముద్దలు’ కావ్య ఆవిష్కరణ

Mar 31,2024 23:46 ##Writer #Addanki

ప్రజాశక్తి – అద్దంకి
‘సృజన’ మహిళా మణులే ప్రతిఏటా నిర్వహిస్తున్నారు. ప్రముఖ కవయిత్రి యనమండ్ర వరలక్ష్మి ‘వరాల గోరుముద్దలు’ కావ్యవిష్కరణ సభ ఆదివారం కాళికా సమేత కమఠేశ్వర స్వామి ఆలయంలో కొల్లా భువనేశ్వరి అధ్యక్షతన నిర్వహించారు. రొటేరియన్ నర్రా శ్రీలక్ష్మి జ్యోతి ప్రజ్వలనతో సభ ప్రారంభించారు. సృజన ప్రార్థనా గీతాన్ని చుండూరి కాళీప్రసన్న ఆలపించారు. పిల్లలను ఆకట్టుకునే విధంగా వరలక్ష్మి రచన ఉందని భువనేశ్వరి పేర్కొన్నారు. బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ దుర్గా గాయత్రి ఈ కావ్యాన్ని ఆవిష్కరిస్తూ తనకు బాధ్యత నప్పగించిన సృజనకు ధన్యవాదాలు తెలిపారు. తొలి ప్రతిని వాసవీ, వనితా క్లబ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ ఉమా అన్నపూర్ణ స్వీకరించారు. న్యాయవాది కొత్తమాసు కుసుమలత మాట్లాడుతూ ‘వరాల గోరుముద్దలు’ లోని కవితలను ఉదహరిస్తూ రసరమ్యంగా ఉన్నాయని అన్నారు. కార్యక్రమంలో మువ్వల కాశీ విశాలాక్షి, దాస్యం లక్ష్మీ రాజ్యం, కథా రచయిత్రి పాలపర్తి జ్యోతిష్మతి, గాడేపల్లి దివాకరదత్, వీరవల్లి సుబ్బారావు (రుద్రయ్య), అన్నమనేని వెంకటరావు, షేక్ మహమ్మద్ రఫీ, రోటరీ అధ్యక్షులు మురళీ కృష్ణ, సంకా బాబు, వారణాసి రఘు రామ శర్మ, శతావధాని నారాయణం సుబ్రహ్మణ్యం, అద్దంకి లెవి ప్రసాద్, జ్యోతి చంద్రమౌళి పాల్గొన్నారు.

➡️