కాంగ్రెస్‌తోనే ప్రజారంజక పాలన సాధ్యం : కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు అంజిబాబు

Jan 17,2024 23:47

ప్రజాశక్తి – బాపట్ల
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా రంజకమైన పాలన అందిస్తుందని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గంటా అంజిబాబు అన్నారు. స్థానిక కాపు కళ్యాణ మండపంలో బుధవారం జరిగిన కాంగ్రెస్ నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. షర్మిల నేతృత్వంలో కాంగ్రెస్ రాష్ట్రంలో మంచి పురోగతి సాధిస్తుందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో బాపట్ల పార్లమెంటు నుండి జెడి శీలం అభ్యర్థిత్వాన్ని బలపరచాలని అన్నారు. కేంద్రంలో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడబోతున్నామని అన్నారు. జిల్లాలోని ఆరు నియోజకవర్గాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు రానున్న ఎన్నికల్లో చేపట్టబోయే కార్యాచరణపై దిశా నిర్దేశం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు డి దేవరాజు, రేణుక, చింతా బాబురావు, బక్కా రోశయ్య, బాపట్ల, రేపల్లె, వేమూరు, చీరాల, పర్చూరు, అద్దంకి నియోజకవర్గాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️