మసీదు పున ప్రారంభం

Mar 11,2024 00:09

ప్రజాశక్తి – చెరుకుపల్లి
మండలంలోని గుల్లపల్లి గ్రామంలో నూతనంగా పునః నిర్మించిన మక్కా మసీదును ఆదివారం ప్రారంభించారు. కార్యక్రమంలో రేపల్లె ఎంఎల్‌ఎ అనగాని సత్యప్రసాద్ రూ.50వేలు, రేపల్లె పొలిటికల్ మేనేజర్ పూషడపు కుమారస్వామి రూ.20వేల విరాళాన్ని ఎంఎల్‌ఎ సోదరుడు అనగాని శివప్రసాద్ అందజేశారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు మీర్జా అజీముద్దీన్, సంఘ పెద్దలు దివి రాంబాబు, వంగర శ్రీనివాస చక్రవర్తి, ఉప్పాల సాంబశివరావు, మండవ తాతాజీ, ఎంఆర్‌కె మూర్తి పాల్గొన్నారు.

➡️